ప్రకృతి ఒడిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి కొలువుదీరారు. ఏంటి విచిత్రంగా ఉంది కదూ..కానీ ఇది సోషల్ మీడియా ఇది నిజం చేసి చూపించింది. విశాఖలోని బీచ్ రోడ్డు స్కైవ్యూ మోడ్ లో తీసిన ఫోటో సాగర తీరంలో వైఎస్.జగన్మోహనరెడ్డి ఉన్నట్టుగా ఆ ఫోటో ఆకృతి కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం ఫేస్ బుక్, ట్వట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తెగ ట్రోల్ అవుతుంది. అయితే ఫోటోని దూరం నుంచి చూసినా..తీసిన ఫోటోని చిన్నది చేసి చూస్తే మాత్రమే ఆ రూపం కనిపిస్తుండటం విశేషం. ఈ ఫోటోను విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్క కూడా తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ద్వారా షేర్ చేశాడు. అంతేనా..దాని గన్ లమధ్య పనవ్ కళ్యాణ రూపం ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. వాటికి కూడా విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే సీఎం వైఎస్.జగన్ ఫోటో ప్రకృతిలో ఇట్టే ఒదిగిపోయినట్టు కనిపిస్తుండటంతో ప్రకృతి ఒడిలో వైఎస్ జగన్..అంటూ కార్యకర్తలు, నాయకులు అంతా వాట్సప్ లలో కూడా స్టేటల్ లు పెడుతున్నారు. విజయ దశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తున్నారని ప్రకటించిన తరుణంలో ప్రస్తుతం ఈ ఫోటో చర్చనీయాంశం అవుతుంది.