వైఎస్సార్సీపీకి విశాఖ తూర్పు నుంచే ఎదురుగాలి..?!


Ens Balu
50
Visakhapatnam
2023-12-26 16:55:23

విశాఖనగరంలోని తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే సీటు గెలిస్తే మిగిలిన మూడు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ పాగావేస్తుందని అధిష్టానం బలంగా నమ్ముత్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి అనుగుణంగానే ఎప్పటినుంచో ఇక్కడ నుంచి పోటీచేస్తారనుకున్న అక్కరమాని విజయనిర్మలను తప్పించి ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణకు కట్టబెట్టారు. తొలుత భీమిలీ నుంచి పోటీచేయాలని అక్కడంతా గ్రౌండ్ వర్క్ చేసుకుంటే అక్కడి నుంచి విశాఖ తూర్పుకి పంపేసింది అధిష్టానం. ఇపుడు మళ్లీ ఇక్కడి నుంచి కూడా సాగనంపి ఆ స్థానంలోకి ఎంపీని తీసుకొచ్చింది. విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో అత్యంత ఎక్కువగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. ఇక్కడ యాదవులను నిల్చోబెడితే సీటు వస్తుందని తొలుత భావించినా ఆ తరువాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీనితో అన్యూహ్యంగా ఎంపి తెరపైకి వచ్చారు. దీనికి అధిష్టానంలో చాలా సీనియర్లు లాబీయింగ్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే తొలుత ఈ స్థానాన్ని ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్ ఆశించారు. అయితే సీటుని ఆయనకి ఇవ్వకుండా కార్పోరేటర్ గా నిలబెట్టి, మేయర్ పదవి ఇస్తున్నట్టుగా ఆశ చూపించినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. తరువాత మేయర్ పదవిని అదే యాదవ సామాజిక వగర్గానికి చెందిన మరో మహిళా కార్పోరేటర్ గొలగాని హరి వెంకటకుమారికి కట్టబెట్టడంతో వంశీ మీడియా ముఖంగానే తన ఆందోళన, ఆవేదన వెళ్లగక్కారు. తరువాత ఆయనను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయినా వంశీ అయిష్టంగానే ఎమ్మెల్సీ పదవిని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఇపుడు తన అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తుండటంతో.. మీరు రాజీనామా చేసేయండి..నేను కూడా త్వరలోనే రాజీనామా చేస్తానన్న చరవాణి ప్రకటనలు ఇపుడు విశాఖలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు అక్కరమాణికి ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీసీటు ఇస్తారని ప్రచారం జరిగినా..మళ్లీ కొనసాగింపుగా విఎంఆర్డీఏ చైర్మన్ పదవే రెండోసారి కట్టబెట్టి బుజ్జగించారు. ఇక్కడ ఆమె కూడా అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నట్టు కేడర్ భావిస్తున్నది. మరోవైపు వీరంతా అధికారంలోకి వస్తే తమకు మంచి మంచి పదువులు దక్కుతాయని ఎంతో కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు అత్యధిక మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టిన వారంతా ప్రభుత్వ సమయం పూర్తయిపోవడంతో విసుగు చెంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

తూర్పు నియోజకవర్గంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుకి చాలా మంచి పట్టుఉంది. సాధారణ కార్యకర్తల నుంచి నియోజవకర్గంలోని ప్రజలందరికీ ఈయన సుపరిచితుడు, ఆత్మీయుడిలా కలిసిపోయి ఉంటారు. ఈయన చౌదరి/కమ్మ సామాజికి చెందిన వ్యక్తి కావడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం కూడా అదే సామాజికి వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ ఎంవివి తూర్పునియోజకవర్గం ఇన్చార్జిగా రంగంలోకి దింపింది. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే సీలు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి మంత్రి కావాలనే ఎంవివి ఆలోచన, విశాఖ తూర్పు నియోజవర్గం పార్టీ ఖాతాలో వేసుకొని నగరంలోని నాలుగు నియోజవకర్గాల్లోనూ మార్పు ఇక్కడి నుంచే తీసుకురావాలనే అధిష్టానం ఆలోచనగా కనిపిస్తున్నది. అయితే తర్పునియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికీ అధిష్టాన సీటు కేటాయించకపోవడంతో ఇక్కడ కేడర్ కూడా అసంతృప్తితో రగలిపోతున్నది. అదే కడుపు మంటలో అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించినా..ఓడిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. యాదవులను ఏడిపించిన వారైనా, పార్టీలైనా చరిత్రలో ఎదిగిన సాక్ష్యాలు లేవంటున్నారు ఈ సామాజికి వర్గానికి చెందిన క్యాడర్ అంతా. తొలుత వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి ఇదే నియోజవకర్గం నుంచి సీటు ఇస్తారనుకున్నా ఇవ్వలేదు. ఆ తరువాత అక్కరమానిని ఇక్కడికి తీసుకువచ్చి..బాగా పునాది వేసుకున్న తరువాత ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చి ఆమెను కూడా ఈ నియోజవకర్గం నుంచి తప్పించేశారు. దీనితో తూర్పునియోజవర్గంలో వైఎస్సార్సీపికి ఎదురుగాలి మాత్రమే మిగిలిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే తర్పు నియోజకవర్గంలోఎమ్మెల్యేగా గెలవడానికి ఎంతైనా ఖర్చుచేసేవారుంటునే అక్కడి సీటు గెలవడానికి అవకాశం వుంటుందని పార్టీ భావించడం వలనే బిల్డర్, వ్యాపారవేత్త, ఎంపీ ఎంవివి రంగంలోకి దించినట్టు కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఇపుడు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులు వైఎస్సార్సీపి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం అన్ని రాజకీయపార్టీలు గుర్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పలు సంఘాలనేతలు, పలు సామాజికవ వర్గాలకి చెందిన నాయకులు కూడా ప్రస్తుతం వైఎస్సార్సీపి నుంచి వేరుకావలని చూస్తున్న ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాసటగా నిలుస్తున్నారు. అదే సమయంలో తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో రానున్న రోజులు ఈ వ్యతిరేక పవనాల గాలి అధికమై మరిన్ని రాజీనామాలు జరగవచ్చునని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ తూర్పులో వెలగపూడి రామక్రిష్ణబాబుని కాదని ఏ పార్టీకి చెందిన అభ్యర్ధి అయినా గెలిచే పరిస్థితి లేదనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. తనను కాదని ఎంవివికి ఎమ్మెల్యే సీటు కేటాయింపు చేస్తున్న విషయంలో 
అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్ లు అసహనంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తమ నాయకుడు కాకుండా మరే ఇతర వ్యక్తులకి సీటు ఇచ్చినా ఖచ్చితంగా ఓడించి తీరుతామని కూడా క్యాడర్ బహిరంగంగానే ప్రకటిస్తుండటం విశేషం. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు ఎదురు తిరిగినా, తిరుగుబాటు జెండా 
ఎగుర వేసినా అధికారపార్టీ మరో రకంగా ఆలోచిస్తుందనే ఒకే ఒక్క కారణంతో వీరి రాజీనామా ప్రకటనలు అపుడే జరగవని కూడా చెబుతున్నారు. పూర్తిగా వ్యతిరేక పవనాలు వీచిన తరువాత ఒకేసారి మూకుమ్మడిగా చేయడం ద్వారా గట్టి దెబ్బకొట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. సామాజిక పరంగా ఎమ్మెల్యే సీటు కోసం ఏకం అయినా..యాదవ సామాజిక వర్గానికి దక్కని గౌరవం చోటులో పార్టీమార్పుతోనూ ఇద్దరు నేతలు ఏకమై అయినా సరే తమని కాదని వచ్చిన అభ్యర్ధిని అనుచరుల సహకారంతో ఓడిస్తారని కూడా చెబుతున్నారు. విశాఖలోని తూర్పు నియోజవర్గం సీటు విషయంలో తెరముందు, తెర వెనుక జరుగుతున్న రాజకీయంపై ఒక్కో రకమైన ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. చూడాలి తిరుగుబాటు దారుల రాజీనామాలు, అలకలతో వైఎస్సార్సీపికి ఎదురుగాలి వీస్తుందా..ఎంవివిలాంటి బడా సౌండ్ పార్టీ నాయకులతో సీటుని పక్కగా గెలిపించి చూపిస్తారా అనేది ఆశక్తి కరంగా మారింది...?!