విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ లక్ష్మినృసింహ స్వామివారి దేవస్థానాకి చెందిన 6.48 ఎకరాల భూముల రికార్డులు తారుమారు చేయడానికి కీలకమైన 3 దశల్లో..మూడు ప్రాంతాల్లో రికార్డులు టేంపరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈసర్వేనెంబరులో జరిగిన, జరుగుతున్న అక్రమకట్టడాలు..అక్కడ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. వీటి ఆధారాల కోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ ww.enslive.net సంయుక్తంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఆశక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ ఆధారాలు బయటపెట్టే ముందు ఈ భూముల రికార్డులు తారుమారు చేసే సమయంలో ఏకంగా ఒక దేవస్థానం ఉద్యోగిని కూడా బలవంతంగా అక్రమార్కులు సీటు నుంచి కదలగొట్టారనే ప్రచారం బయటకొచ్చింది. ఆ3 దశలు ఏంటి, ఏ మూడు ప్రాంతాల్లో రికార్డులు టాంపరింగ్ చేశారనే విషయాలు ఆధారాలతో బయట పెట్టబోతున్నాం.