ఆఫీసర్ అనుకొని ఇంటర్వ్యూకి వెళితే ఆఫీసర్ గానే తిరిగొస్తారు..!


Ens Balu
210
Anakapalle
2023-08-05 02:31:18

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే ఎపిపిఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూలకి క్వాలిఫై అయిన అభ్యర్ధులందరూ మీరే ఒక ఆఫీసర్ లా ఫీల్ అవ్వండి.. అదే మనోధై ర్యంతో వెళ్లి.. ఉత్సాహంగా ఇంటర్వ్యూని ఫేస్ చేయండి..మీరు ఆఫీసర్ గా ఇంటర్వ్యూకి వెళితే తిరిగి వచ్చేటపుడు  మంచి ఆఫీసర్ గా అపాయింట్ మెంట్ తో తిరిగి వస్తారు.. మీలోని విల్ పవర్ ఏంటో మీకు కళ్లముందు కనిపిస్తుంది.. కాస్త వెరైటీగా ఉంది కదూ..నిజమే నేను ఆ సీనియర్ పోలిస్ అధికారిని ఇంటర్వ్యూ చేసినపుడు నాకూ అలానే అనిపించింది.. ఎప్పుడూ, ఎక్కడా..ఏ గ్రూప్-1 అధికారి చెప్పని విధంగా, ఫైనల్ ఇంటర్వ్యూలకు వెళ్లే ఆశావాహులకు మంచి అంశాలు సూచించిన విధానం.. ఆ స్పూర్తిదా యకమైన సూచనలు నిజంగానే ఇంటర్వ్యూని ఫేస్ చేసేవాళ్లకి దైర్యాన్ని, స్పూర్తిని కలిగిస్తాయి.. పక్కాగా జాబ్ ని తెచ్చిపెడతాయనే విషయం ఆ అధికారి మాటల్లో చాలాస్పష్టంగా కనిపించింది.  ఆయన ఎవరో కాదు.. అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్(అడ్మిన్) బి.విజయభాస్కర్. ఒకసారి సివిల్ సర్వీస్, 3 సార్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ఫేస్ చేసి చివరకు 2012లో గ్రూప్-1 డిఎస్పీగా జాబ్ సాధించిన బెస్ట్ ఆఫీసర్. ఆయనలా మరే ఫైనలిస్ట్ సివిల్ సర్వీస్/ఎపిపిఎస్సీలో జాబ్ కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా పోటీ పరీక్షల్లో ఫైనల్స్ చేరుకునేవారిని చైతన్యం చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్తంగా గ్రూప్-1 ఇంటర్వ్యూ 
అభ్యర్ధుల కోసం ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ విలువైన వివరాలు, సూచనలు, సలహాలు మీకోసం..!

 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఔత్సాహికులంతా ముందు వారిలోని విల్ పవర్ ను పెంచుకోవాలంటున్నారు ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్. ఆయనను గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్ధుల కోసం సూచనలు, సలహాలు ఇవ్వమని చెప్పినపుడు ఆయన మాట్లాడిన మాటలు తొలుత ఒక జర్నలిస్టుగా నన్నే ప్రభావితం చేశాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంటర్వ్యూ పూర్తిచేసుకొని బయటకు వస్తూ..నేనూ  ఒక గ్రూప్-1 అధికారిని అయ్యాననే భావన కలిగింది. ఆ స్థాయిలో ఆయన చెప్పిన స్పూర్తిదాయకమైన సూచనలు త్వరలో ఇంటర్వ్యూలకి హాజరయ్యేవారికి కూడా అలానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల వరకూ వెళ్లారంటే వారందరూ నా ద్రుష్టిలో వారు ఆఫీసర్స్..అంతేకదా..అలా కాకపోతే వాళ్లు ఇంత వరకూ రారు..అలా చివరకు వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆఫీసర్ లా మారిపోవాలి..అలా మారిపోయి ఇంటర్వ్యూని ఫేస్ చేస్తే..ఆ ఉత్సాహం, మనోదైర్యం మంచి అధికారిగా తిరిగొచ్చేలా చేస్తుంది అని తడుముకోకుండా చెప్పారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఎన్ని రకాల ఉద్యోగాలకు ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందో చూసుకొని సదరు ఉద్యోగాలపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆర్డీఓ పోస్టుకైతే రెవిన్యూ అంశాలు, డిఎస్పీ పోస్టుకైతే లా అండ్ ఆర్డర్, ఐపిసి, సిఆర్పీసి సెక్షన్లు, సిటిఓ పోస్టుకై వాణిజ్య పన్నులు, ఆర్టీఓ పోస్టు కైతే రవాణా, మోటారు వెహికల్ యాక్టు.. ఇలా ఎన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయో అన్నిశాఖలపైనా 
అవగాహన పెంచుకోవాలి. దానికి అనుగుణంగానే సామాజిక రాజకీయ, బౌగోళిక, ఆర్ధిక పరమైన అంశాలను అంచనా వేస్తూ..మీ చదువు, కుటుంబ నేపథ్యం ఇలా అన్నింటిపైనా పట్టుసాధించాలి అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీయబోయే గ్రూప్-1 పోస్టులన్నింటికి ఒక్కో పోస్టుకి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నది..అంటే సగం ఉద్యోగం మనకి వచ్చినట్టే..మిగిలిన సగం పూర్తిగా రావాలంటే అది మనం ఫేస్ చేయబోయే ఇంటర్వ్యూని బట్టే వుంటుంది. అదే మన లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పిన మాట నిజంగా ఎంతో ఛాలెంజింగ్ అనిపించింది. మధ్యలో ఆయన చెప్పే సూక్తులు ‘ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ భానిస అవుతుంది’ అని చెబుతూ..ఆ విధంగా మనం వెళ్లే ఇంటర్వ్యూలో ఒక ఉద్యోగం మన బానిసగా మనతోనే మనవెంటే వచ్చేవిధంగా ఎంతో సమయస్పూర్తితో సమధానాలు చెప్పేలా తయారు కావాలని సూచించారు. చాలా ఏళ్ల తరువాత ప్రభుత్వం అత్యంత త్వరగా ఎపిపిఎస్సీ ద్వారా భర్తీచేస్తున్న ఈ ఉద్యోగాలపై చాలామందికి అత్యంత పెద్ద స్థాయిలో అంచనాలున్నాయని..వాటిని చేరుకోవాలంటే ముందు ఆ ప్రభుత్వశాఖలు, ఉద్యోగాలు, వాటి యొక్క విధులపైన మనకి మంచి అవగాహన ఉండాలని అన్నారు. తాను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని.. ఎపిపిఎస్సీ జాబ్స్ ఇంటర్వ్యూలు కూడా సివిల్ సర్వీస్ స్థాయిలోనే ఉంటున్నందున ఆ స్థాయిలోనే అభ్యర్ధులు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఎంతబాగా పరీక్షలు రాసారో..అంతకు మించి ఇంటర్వ్యూలో అంత చక్కగా ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఒక ఉన్నత లక్ష్యంతో గ్రూప్-1 జాబ్ కొట్టాలనుకునే వారికి ఈ ఇంటర్వ్యూలు నిజంగానే ఛాలెంజ్ గా నిలుస్తాయని..వాటిని సమయస్పూర్తితో అధిగమిస్తే విజయం సొంతం అవుతుందని చెప్పారు. ఉద్యోగం కోసం ఎంత శ్రమించి ఈ స్థాయి వరకూ వచ్చామో..అదే స్పూర్తితో ఉద్యోగం వచ్చిన తరువాత కూడా ప్రజలకు ఆ స్థాయిలోనే సేవ చేయాలని అపుడే మనం సాధించిన రాష్ట్రస్థాయి ఉద్యోగానికి అర్ధం, పరమార్ధం, ఒక సార్ధకత లభిస్తాయన్నారు. ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలు అన్ని తెలిసినట్టుగానే ఉంటాయని..కానీ సమాధానం చెప్పడంలోనే మనకి మంచి సర్వీసు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. అలా మంచి సర్వీసు సాధించాలంటే ప్రభుత్వశాఖలు, వాటి విధులు, పరిపాలన, ప్రభుత్వ వ్యవహారాలపై మంచి పట్టు ఉండాలని అన్నారు. ఆ దిశగా అభ్యర్ధులు సన్నద్దం కావాలన్నారు. విజయం సాధించే సమయంలో ఇంటర్వ్యూ ఒక వారధి అని.. ఆ వారధికి మనం సారధిగా మారినపుడు మాత్రమే గ్రూప్-1 ఉద్యోగాల్లో మంచి సర్వీసు సొంతం చేసుకోవడానికి ఆస్కారం వుంటుందని ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్ చెప్పుకొచ్చారు. సమయం మించిపోతున్నది..ఆయనతో ఎంతసేపు మాట్లాడుతున్నా..ప్రతీ ప్రశ్నకూ ఎంతో విలువైన సమాధానాలు చెబుతూనే ఉన్నారాయణ..ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది.. దాని వైపు చూస్తూ..బాలుగారు మనం మరోసారి కలుద్దాం అంటూ పైకి లేచారు...అన్నట్టు మర్చిపోయాను గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారందరికీ.. కాదు కాదు కాబోయే ఆఫీసర్లు అందరికీ నా శుభాకాంక్షలు చెప్పండి మన ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా అన్నారు. నాకు అర్ధమైపోయింది.. ఫోనులో ఎవరో పెద్ద అధికారే అయి ఉంటారని.. విధినిర్వహణకు గౌరవం ఇచ్చి తేంక్యూ సర్ మంచి అధికారిని, అందునా మీలాంటి 
అధికారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం గ్రూప్-1 ఇంటర్వ్యూల వలన వచ్చిందని చెప్పి వెనుతిరిగాను.. వస్తూనే నాలోనే ఏవో ఆలోచనలు.. ఆసమయంలో 
నేనూ గ్రూప్-1 ఇంటర్వ్యూకి క్వాలిఫై అయి ఉంటే బాగుణ్ణు అనిపించింది. సరే మరి.. మరో మంచి అధికారి ఇంటర్వ్యూలో మళ్లీ కలుద్దాం..అంతవరకూ సెలవ్ మీ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), చీఫ్ రిపోర్టర్, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, Ens Live App, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net విశాఖపట్నం..!