ప్రజా కవులు, కళాకారులు ప్రకృతిని ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించరు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ప్రజా యుద్ధనౌక గద్దర్. ప్రకృతిలో పేర్లను తన పిల్లలకు పెట్టి.. వాటికి అనుగుణంగానే వారిని పెంచారు. ఆయన పిల్లల పేర్లలో ఒకరికి సూర్యుడు, మరొకరికి చంద్రుడు, ఇంకొకరికి వెన్నెల అనిపెట్టారు. ముఖ్యంగా విప్లవ పాటలు పాడిన గద్దర్, తన పిల్లలకూ అదే విప్లవ భావజాలంతో పెట్టిన పేర్లు మరోసారి ఆయన మృతితో తెరపైకి వచ్చాయి. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం రాగానే కమలను ఆయన వివాహం చేసుకున్నారు. 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ప్రభావితుడై విప్లవ ఉద్యమంతో మమేకమయ్యారు. కాగా 2003లో అనారోగ్యంతో చంద్రుడు మరణించారు. గద్ద ర్ అంటే తెలియనివారు ఉండరనే పదం చాలా చిన్నది. అదే సమయంలో ఆయన పిల్లలకు పెట్టిన పేర్లు మాత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.