విజయనగరం జిల్లాలోని సబ్ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో జామాబందీ కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి అధికారులు క్రుషి చేయాలని సబ్ కలెక్టర్ భావన ఆదేశించారు. జిల్లాలోని సాలూరు తహశీల్దార్ కార్యాలయంలో బుదవారం జమాబందీ నిర్వహించారు. ఈ సందర్భం అర్జీలు అందజేయడానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వహించిన జమాబందిలో మొత్తం 04 దరఖాస్తులు అందాయని ఆమె పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.