రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారత్ రామ్ అనుచరుడు రౌడీ షీటర్ "శ్రీనివాస్ యాదవ్" నుంచి తనకు, వృద్దాశ్రమం కు రక్షణ కల్పించాలని అమ్మానాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుడు పడగల ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని పోలీసులను అభ్యర్ధించారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్దులకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో అమ్మా నాన్న ఓల్దేజ్ హోమ్ 5 ఏళ్లుగా నడుపుతున్నామని..లాభపేక్ష స్వార్ధం లేకుండా వృద్దులకు ప్రశాంతత జీవనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి తమను రాజమండ్రి లో పేరు మోసిన కిరాయి రౌడీ షీటర్ , మాజీ ఎంపి భరత్ అనుచరుడు తురాల శ్రీనివాస్ యాదవ్ మా ఓల్దేజ్ హోమ్ నుండి రౌడీ మాములు ఇవ్వాలని.. లేకుంటే తమ పత్రిక ఈవేళ లో మీ సంస్థ కోసం వార్తలు వ్రాసి మీ పరువు తీస్తా అంటు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ ముద్దాయిగా ఉన్న ఎస్ టి, ఎస్ సి కేసు నెం : 199/2025, ఎస్ సి నెం : 111/2025 లో తాను సాక్షి ఉన్నందుకే తమపై బెదిరింపులకు దిగి బెదిరింపులకు దిగుతూ.. తన సొంత పేపర్ పై అవ్వాకులు, చెవ్వాకులు ముద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అనుకూలంగా కోర్టు లో శ్రీనివాస్ యాదవ్ కు వ్యతిరేకంగా పోలీసులు తన పేరు సాక్షిగా నమోదు చేశారన్నారు. నిజానికి ఆ కేసు కు నాకు ఏ సంబంధం లేదని తాను వ్రాసుకొచ్చిన పిటిషన్ పై సంతకం చేయమని బెదిరిస్తున్నాడని వివరించారు. కోర్టులో తనకు అనుకూలంగా చెప్పకపోతే పొతే చంపేస్తానంటు బెదిరిస్తున్నాడన్నారు. అతని వద్ద కరుడు కట్టిన కిరాయి నేరస్తులు వున్నారని బెదిరిస్తున్నాడని చెప్పారు. రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ లక్షలాది రూపాయి లకు ఐ పి పెట్టి ప్రజలను మోసం చేశాడన్నారు. కిరాయిలకు రౌడీ యిజం చేస్తు ఇళ్ళు, షాపులు ఖాళీ చేయించటం ఇతగాడి నేర వృత్తిగా ఎంచుకున్నాడని చెప్పారు.
దాడులు దౌర్జన్యాలు తో వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురి చేయటం వంటి నేరాలను కిరాయికి చేయటం ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదించాడని ఆరోపించారు. . నకిలీ పత్రాలు సృష్టించి ఇతరుల ఆస్తులను తన రౌడీల ద్వారా కాజేస్తుంటాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ బెదిరింపులకు తలోగ్గ లేదని గతంలో మా సంస్థలో 2 నెలలు ఆశ్రయం పొందిన గద్దె వెంకట కృష్ణ అనే వృద్ధుడు కొంతమంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవరించినందుకు బయటకు వెళ్ళిపో మని చెప్పి కొంత సమయం ఇచ్చి పంపి వేసామన్నారు. అలాంటి వృద్ధుడును రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ దగ్గరకు చేర్చుకుని నా పైన, మా సంస్థ పైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడన్నారు. సదరు వృద్ధుడు చేసిన ఆరోపణలు అన్ని నిరదారమైనవని..విచారణ జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయని అన్నారు.
తాము కూడా విచారణ కోరుతున్నామన్నారు. రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ కారణంగా నా ప్రాణానికి ముప్పు వుందని.. అదే విధంగా అతని అన్ని చర్ల నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పై దుష్ప్రచారం చేస్తూ తన హక్కులకు బంగం కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రౌడీ షీటర్ శ్రీనివాస్ యాదవ్ కు తన సాక్షిగా వున్నటు వంటి కేసులో బెయిల్ రద్దు చేసి నాకు తగు రక్షణ కల్పించాలని... రౌడీ షీటర్ కు అండగా నిలిచిన అనుచరులపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను అభ్యర్ధించారు. ఈ సమావేశంలో మిస్క జోగి నాయుడు, గొంతెన అప్పన బాబు, సత్తి సూర్య భాస్కర్ రావు, కాండ్రేగుల కొండలరావు, సంగిడి పుష్పమ్మ, జి కోటేశ్వరరావు, ఎంకే చౌదరి, శివ సర్వీస్ వాలంటీర్స్ కృప, భావన, తనుజ, అమ్మానాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్దులు తదితరులు పాల్గొన్నారు.