శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కండి-ఈరోజు బాలు


Ens Balu
31
కొయ్యూరు
2026-01-25 09:10:11

కొయ్యూరు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉన్న శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయానికి రేకుల షెడ్డు సమకూరింది. అమ్మవారు కోరిక కోర్కె తీర్చడంతో అమ్మవారికి మొక్కుకున్న  మొక్కు మేరకు ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన సంపాదకులు పి.బాలభాను(ఈరోజు బాలు) ఈ మేరకు   రూ.30వేల వ్యయంతో  ఈ రేకుల షెడ్డు నిర్మించారు. ఈ రేకుల షెడ్డు నిర్మాణాన్ని ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్టులు పందిరి సత్యన్నారాయణ దగ్గరుండి చేయించారు. అమ్మవారి ప్రధాన మూలవిరాట్టు.. పురాతన విగ్రహం వద్ద ఖాళీ ప్రదేశం ఉండిపోయింది. అక్కడ అమ్మవారికి పూజలు చేసే సమయంలో నీడ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఓ శుభకార్యం విషయంలో అమ్మవారిని కోరిక కోర్కె తీరడంతో వెంటనే రేకుల షెడ్డు నిర్మించారు. 

ఈ సందర్భంగా భక్తుడు పి.బాలభాను(ఈరోజు బాలు) మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డు చింతాలమ్మ తల్లి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమని.. ఇక్కడ అమ్మవారిని ఏం కోరుకున్నా అది జరిగి తీరుతుందన్నారు. ఈ క్రమంలో అలా మొక్కలు తీరిన వారు అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఘాట్ నేషనల్ హైవేగా మారిన తరుణంలో ఆలయానికి బక్తుల తాకిడి ఎక్కువైందని.. ప్రతీ ఆదివారం, మంగళవారం, గురువాలరాలు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పండుగలు జరుగుతుండటం అభినందనీయమన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా మంచినీటి సౌకర్యం, భవనాలకు ఐరన్ ఫెన్సింగ్, షామియానా, విద్యుత్ సౌకర్యం, టెంట్లు, షాపుల నిర్మాణాలకు దాతలు ముందుకి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 

భక్తులందరూ అమ్మవారి ఆలయం అభవృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా ఈ ప్రాంతం కూడా టెంపుల్ టూరిజంగా మార్పు చెందడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ ఘాట్ రోడ్డు ప్రాంతం నేషనల్ హైవేగా మారిన తరువాత ఈ ప్రాంతాన్ని చూడటానికి చాలా మంది వస్తున్నారని.. అలావచ్చిన భక్తులు అమ్మవారి ఆలయ అభివృద్ధి మౌళిక సదుపాలయ కల్పనలో భాగస్వాములు కావాలన్నారు. ఇకపై తనకు మేలు జరిగే ప్రతీ విషయంలో అమ్మవారి ఆలయ అభివృద్ధిలో తాను స్వచ్చందంగా భాగస్వామిని అవుతానని ఈ సందర్భంగా ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన సంపాదకులు పి.బాలభాను(ఈరోజు బాలు) స్పష్టం చేశారు.

సిఫార్సు