విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలోని దళిత ఉద్యోగిని సుష్మాపై చేయిచేసుకోవడంతోపాటు కులం పేరుతో దూషించడంతో ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీనితో కేసు నమోదు విషయంలో జరిగిన హైడ్రామాకి తెరపడింది. నాలుగురోజుల పాటు అటు పోలీసులు, ఇటు రెవిన్యూ అధికారులు బెదిరించైనా కేసు నమోదు కాకుండా రాజీ చేయాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈరోజు-ఈఎన్ఎస్ లో వరుస కథనాలు రావడం, దళిత సంఘాలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, బాధితురాలు కేసు కట్టాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టక తప్పలేదు. ఈ సమయంలో కేసు పెట్టకుండా ఉండేం దుకు ఇన్చార్జి ఆర్డీ ఆయుష్ కమిషనరేట్ నుంచి కమిషనర్ మొదలు కొని రాజకీయంగా తనకున్న పలుకుబడి మొత్తం వినియో గించినా ఫలితం లేకుండా పోయింది. అదేసమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన మీడియాలో దళిత ఉద్యోగినే తనను కొట్టిందని అనుకూల వార్తలు రాయించినా కూడా కేసు ఎఫ్ఐఆర్ కాకుండా ఆపలేకపోయాయి.
అదే సమయంలో విశాఖ సిపీ శంఖబ్రత బాగ్జీ చొరవ తీసుకోవడం కూడా దళిత మహిళా ఉద్యోగిని విషయంలో కేసు నమోదు కావడానికి ఉపయోగపడింది. గత కొద్దిరోజులుగా అన్ని వ్యవహారాల్లోకి తలదూర్చి తనను ఎవరూ ఏమీ చేయలేరని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేరని బీరాలు పోయి అటు దళిత వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని కూడా బెదిరించి మరీ నాలుగు రోజుల పాటు కేసు నమోదు కాకుండా ఆపించుకున్నారు. అయితే అన్నిరకాలుగా బాధిత దళిత ఉద్యోగిని వైపే వాస్తవాలు కనిపించడం, అదే సమయంలో దళిత ఉద్యోగులు కూడా తమను మాలనాకొడకా.. మాదిగ నా కొడకా అని కులం పేరుతో దూషించిన ఫిర్యాదు ఆయుష్ కమిషనర్ కి చేరడం, విమ్స్ ఆసుపత్రిలోకి ఆర్డీడి కార్యాలయం తరలింపు విషయంలో ఈ గొడవలు మొత్తం విమ్స్ డైరెక్టర్ కి తెలిసి ఆయన విమ్స్ లోనికి రానీయ కుండా అడ్డుకోవ డంతో.. ప్రాధమికంగా జరిగిన విచారణలో ఆర్డీడికి అన్నీ వ్యతిరేక అంశాలు కనిపించడంతో ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయక తప్పలేదు.
-ముందే పసిగట్టి వార్నింగ్ ఇచ్చిన ఆయుష్ కమిషనర్
విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అవుతుందని ముందుగానే భావించిన కమిషనర్ డి.మంజుల ఇన్చార్జీ ఆర్డీడిని లాంగ్ లీవ్ పై వెళ్లమని ఆదేశించారట. అయితే తాను ఎలాగైనా ఎస్సీ, ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చూసుకుంటానని, అదే సమయంలో తనను లైంగికంగా వైద్యులు కూడా వేధించారని కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. మీడియాలో వరుస కథనాలు ఇన్చార్జి ఆర్డీడికి వ్యతిరేకంగా రావడంతో ఆఖరిసారిగా శనివారం కమిషనరేట్ నుంచి ఫోన్ చేసి హెచ్చరించడంతో రాత్రికి రాత్రికి ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు. అదీ కూడా ఉదయం తనపై ఫిర్యాదు చేసిన దళిత వైద్యుడు పనిచేసే సింహాచలం డిస్పెన్సరీకి ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో రిజిస్టర్లు తనిఖీలు చేసి ఆ రిపోర్టుని కూడా కమిషనరేట్ కి పంపించిన తరువాత మాత్రమే ఆమె లాంగ్ లీవ్ లోకి వెళ్లడం విశేషం.
అంతేకాదు.. తనపై వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను కానీ, తనపై ఫిర్యాదులు చేసిన ఆయుష్ సిబ్బందిని, వైద్యులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని చెప్పి మరీ లాంగ్ లీవ్ లోకి వెళ్లిపోయారు. విశేషం ఏంటంటే సీనియారిటీ లిస్టుని, రోస్టర్ పాయింట్స్ ను కాదని ఇన్చార్జి ఆర్డీడి విధుల్లోకి చేరిన దగ్గర నుంచి సీనియర్ వైద్యులను, సిబ్బందిని ఇబ్బందులు పెట్టడంతో మొత్తమంతా ఏకమై కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దానిని మనసులో పెట్టుకున్న ఇన్చార్జి ఆర్డీడి అందరినీ విధులకు సక్రమంగా రావడం లేదనే కారణం చూపి వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే దళిన ఉద్యోగిని సుష్మాపై చేయిచేసుకోవడంతోపాటు కార్యాలయ సిబ్బంది అందరి ముందు వార్నింగ్ ఇచ్చి ఇకపై టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తానని కూడా బెదిరింపులకు దిగారు. అన్నీ వెరసి ఎస్సీ, ఎస్టీ కేసుకు దారితీశాయి. కొసమెరుపు ఏంటంటే ఆయుష్ లోని డాక్టర్లుగా విధులు నిర్వహిస్తూనే.. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చాలా మంది డ్యూటీ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలని ముందస్తు సమాచారం ఆకస్మిక తనిఖీలు చేసే సమయంలోనే కొందరు వైద్యులు తమను వేధిస్తున్నారంటూ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.