అట్లుంటది మనతోని..! యోగా కాదు.. మహిళా అధికారిణిల ముష్టియుద్దం ..?


Ens Balu
394
visakhapatnam
2025-06-12 19:19:52

విశాఖలో యోగాంధ్రను విజయవంతం చేయాలని, గిన్నిస్ రికార్డు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ అహర్నిశలు శ్రమిస్తూ... యోగా కాకుండా ముష్టి యుద్దాలు చేసుకొని మహిళా అధికారులు జిల్లా పరువుని రచ్చకీడ్చేందుకు చూస్తున్నారు. ఇదే ఇపుడు విశాఖలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే ఆయుష్ ఇన్చార్జి ఆర్డీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ యోగాంధ్ర కార్యక్రమ అధికారిణిపై చేయిచేసుకోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. ఇటీవలే ఆయుష్ లోని దళిత ఉద్యోగిణిలపై చేయి చేసుకోవడంతో ఎస్సీ ఎస్టీ కేసు కూడా పీఎం పాలెం పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యింది. అయినా ఈమెలో మార్పురాలేదన్న విషయం ఆంధ్రాయూనివర్శిటీ  కన్వెన్సన్ సెంటర్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా క్రీడాభివృద్ధి శాఖధికారిణిపై చేయి చేసుకోవడంతో మళ్లీ ఆ విషయం మీడియా వరకూ వచ్చింది. యోగా అనే సరికి ఆయుష్ లోని ఆయుర్వేద విభాగమే గుర్తొస్తుంది. సంబంధిత శాఖ అధికారి ఉండటంతో పనులు అప్పగించిన జిల్లా కలెక్టర్ కు ఇన్చార్జీ ఆర్డీడీ విషయంలో తలనొప్పులు మాత్రం తప్పడంలేదు.

 క్రిందిస్థాయి సిబ్బందిపై నోరు పారేసుకున్నట్టు సహచర జిల్లా అధికారులపై నోరు చేయి పారేసుకుంటే మామూలుగా ఉండదనే విషయం ఇపుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులందరికీ అర్ధమైంది. చేయిచేసుకోవడంతోపాటు దుర్భాషలాడుకోవడం, తిట్ల పురణాం కూడా అక్కడ వారిని అవాక్కైయ్యేలా చేసింది. అయితే ఈ విషయం కాస్తా మీడియా తెలియడంతో ఏమీ జరగననట్టే ఇద్దరు అధికారిణిలు వివరణ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. విశాఖలోని ఇన్చార్జి ఆర్డీడీకి చేయి దురుసు ఎక్కువనే సంగతి రాజధానికి కమిషనర్ కార్యాలయం వరకూ అందరికీ తెలుసు. కానీ సీనియర్ ఐఏఎస్  అధికారులను లాబియింగ్ చేయడానికి ఒక ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు ప్రతీ సారి మధ్య దూరి నానా యాగి చేసి విషయాన్ని తప్పుదోవ పట్టిస్తారట.  జూన్ 21న యోగా దినోత్సవానికి భారత ప్రధాని నరేంధ్రమోడీ వస్తున్నారు. దానితో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైత విశాఖలో జరిగే అతి పెద్త ఈవెంట్ ను గిన్నీస్ రికార్డులో నమోదు అయ్యే విధంగా రాత్రనకా పగలనకా శ్రమించి పనిచేస్తున్నారు. రెండువేల మంది యోగా ట్రైనర్స్ ని పెట్టి మరీ ప్రతీ నిత్య శిక్షణలు ఇస్తున్నారు. 

ఈ క్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారిణి, జూన్ గాలియట్, ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ కి మద్య ఏవో లిస్టులవిషయంలో మాటా మాటా పెరిగి అది కాస్త కొట్టుకునే వరకూ వెళ్లిందని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈవెంట్ మొత్తం తననే చూడమన్నారని.. మధ్యలో వచ్చి మీరేం చేస్తారన్నట్టుగా మాట్లాడటంతో అటువైపున అధికారి కూడా తనను కూడా జిల్లా కలెక్టరే ఈ యోగాంధ్ర పనులు అప్పగించారని చెప్పడంతో మాటలు పెరిగి అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకునేంతవరకూ వెళ్లిందట. ముందుగా ఆయుష్ ఆర్డీడీ చేతిలో ఫైలు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారిణి లాక్కోవడంతో ఆయుష్ ఆర్డీడీ చేసి చేసుకున్నారని చెబుతున్నారు. ఈ తంతు జరుగుతున్నప్పుడు అక్కడ జిల్లా అధికారులు, క్రిందిస్థాయి సిబ్బంది ఉన్నా పట్టించుకోకుండా ముష్టియుద్దాలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యంలోకి దింపిందట. అయితే జిల్లా అధికారుల మధ్యకు వెళ్లడం శ్రేయస్కరం కాదని మిగిలిన సిబ్బంది అలా చూస్తూ ఉండిపోయినట్టు సమాచారం అందుతుంది. 

అయితే క్రీడాభివృద్ధి అధికారిణిపై చేయిచేసుకున్న సమాచారం తెలియడంతో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధి స్వయంగా జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారిణి జూన్ గాలియట్ తోనూ, ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ తో చరవాణిలో మాట్లాడగా తొలుత ఇద్దరు అధికారిణిలు అసలు ఏమీ జరగలేదని.. ఆ అధికారిణి ఎవరో తెలియదని ఈమె.. ఆ అదికారిణి తెలియదని ఆమె చెబుతూ వచ్చారు. ఆంధ్రాయూనివర్శిటీ కన్వెన్షన్ లో జరిగిన తంతు మొత్తం వివరించడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధికారులు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తాము తిట్టుకున్నాం తప్పితే కొట్టుకోలేదన్నారు. అసలు గొడవ ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా చేతిలోని రెండువేల మంది యోగా ట్రనర్స్ లిస్టు లిస్టు దురుసుగా లాక్కున్నారని. ఆ సమయంలో చేతిలో లిస్టులు విధిల్చుకున్నాం తప్పితే కొట్టుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఇద్దరు అధికారిణిలు చాలా దారుణంగా తిట్టుకొని, కొట్టుకున్నారని, ఇదంతా అక్కడి అధికారుల సమక్షంలోనే జరిగిందని చూసిన వాళ్లు మీడియాకి చెప్పడం విశేషం. 

కాగా ఈ విషయం కలెక్టరేట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు అధికారిణిల్లో ఒకరిని యోగాంధ్రా విధుల నుంచి తప్పించారని కూడా సమాచారం అందుతున్నది. అంతేకాదు అధికారులు వార్నింగ్ తో కొట్టుకోవడం కాదు.. తిట్టుకున్నామన్నట్టుగానే బయటకు చెప్పాలని సంకేతాలు అందినట్టు తెలిసింది.కాగా ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ విషయంలో తప్పంతా ఆమెదే ఉంటుందని ఇదే శాఖ సిబ్బంది సిబ్బంది కూడా ఒంటి కాలపై లేస్తున్నారు. అంతేకాదు ఏయూ కన్వెన్షన్ హాలు జరిగిన తంతును కూడా వీడియో రికార్డింగ్ కూడా చేశారనే చెబుతున్నారు. ఆయుష్ లోని క్రిందిస్థాయి సిబ్బందిపైనే చేయి చేసుకున్న అధికారిణి అక్కడ విధులు నిర్వహించే వారిపైనా, తన మాటలకు అడ్డొచ్చే వారిపైనా చేయిచేసుకుందంటే వాస్తవం లేకపోలేదని బాహాటంగానే చెబుతున్నారు. 

ఇప్పటికే ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడీ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న కలెక్టరేట్ అధికారులు ఈ వ్యవహారంతో ఏ విధంగా వ్యహరిస్తారో తెలియాల్సి ఉంది. ఇన్చార్జి ఆర్డీడీ చేతిలో చేతిలో దెబ్బలు తిన్న అధికారిని నేరుగా జిల్లా కలెక్టర్ కి వాట్సప్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కానీ అయితే సహచర అధికారులు, క్రింది స్థాయి సిబ్బందితో ప్రవర్తన బాగాలేని కారణంగా ఆమెను యోగాంధ్ర విధుల నుంచి తప్పించినట్టు కూడా సమాచారం అందుతున్నది. మహిళా అధికారిణిల ముష్టియుద్దంపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.. ముష్టి యుద్దం విషయమై ఇద్దరుు అధికారిణిలను వివరణ కోరగా తిట్టుకున్నాం తప్పితే కొట్టుకోలేదని.. కావాలంటే విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని.. అలాగని ఏమీ లేకుండా మీరేమీ చిలవలు పలవలు అల్లి రాసేయవద్దని చెప్పడం మాత్రం గమనార్షం.!!
సిఫార్సు