రాజకీయంలో శాస్వత శత్రువులు.. శాస్వత మిత్రులు ఉండరంటారు.. కానీ జనసేన ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయంలో మాత్రం ఆ రెండింటికీ ఆపోజిట్ లోనే జరిగింది.. కాదు కాదు.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తన దమ్ము నిరూపించుకున్నాడు ఎమ్మెల్యే వంశీ.. అవును ఏంటా రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నారా.. తనని మేయర్ సీట్ పై కూర్చోబెడతానని ఎమ్మెల్యేస్థాయి వ్యక్తిని కార్పోరేటర్ గా నిలిబెట్టి.. అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారిని మేయర్ ను చేసింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఆ సమయంలోనే యాదవులు, వంశీ వర్గీయులంతా వైఎస్సార్సీపీపై కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వంశీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. రెండుమూడేళ్లు పదవిని అనుభవించిన వంశీ.. ఎందకనో ఆ పదవిలో ఉండకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి 2024 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.. కట్ చేస్తే.. వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చారనేది ఒక్కసారి పరిశీలిస్తే..
తనను విశాఖ మేయర్ ని చేస్తానని ఎమ్మెల్యేస్థాయి వ్యక్తిని కార్పోరేటర్ గా నిలబెట్టి.. ఆపై వైఎస్సార్సీపీ విశాఖ మేయర్ స్థానాన్ని గొలగాని హరివెంకట కుమారికి కట్టబెట్టింది. ఆనాడే తాను యాదవుడని.. తనను నమ్మించి మోసం చేస్తారా..? తన ఉసురు తప్పక తగుతులుందని తన వర్గీలయుంతా అలకబూనారు. అయితే మంచి పదవి ఇస్తే ఆ అలకపోతుందని భావించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయినా తనకి జీవిఎంసీ మేయర్ విషయంలో జరిగిన అవమానం మాత్రం వంశీక్రిష్ణ మదిలో అలాగే ఉండిపోయి వుంటుందని నేటి అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత తెరపైకి వచ్చిన హాట్ టాపిక్ విశ్లేషకుల అంచనాలకు వార్తగా మారింది. చులకైన చోటే చక్రం తిప్పి.. అదే వైఎస్సార్సీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేసిన గ్రౌండ్ లెవల్ నెట్వర్క్ ఇపుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. అంటే ఒక పార్టీలో అవమానం జరిగితే.. అవకాశం వచ్చినపుడు అవమానించిన పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చు అనే విషయాన్ని వంశీ ఎత్తుడ ద్వారా మరోసారి రాజకీయ పార్టీలకు తెలిసి వచ్చినట్టు అయ్యింది.
ఆ నాడు కార్పోరేటర్ గా నిలబెట్టి మేయర్ ఇవ్వకుండా అవమానించిన అదే వైఎస్సార్సీపీ అభ్యర్ధిని అవిశ్వాసంతో క్రిందికి దించి వంశీ తన సత్తాను వైఎస్సార్సీపీ తెలియజేశాడని... అంటే ఈ లెక్కన రాజకీయపార్టీలు ఎపుడైనా నమ్ముకున్న పార్టీలు, పార్టీలోని వ్యక్తులు మోసం చేస్తే.. ఎప్పటికైనా రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం తప్పదనే సంకేతాన్ని వంశీల జివిఎంసీ మేయర్ అవిశ్వాసం నెగ్గిన తరువాత ఇచ్చినట్టు అయ్యింది. ఇదే విషయాన్ని అటు వైఎస్సార్సీపీలో కూడా పార్టీనేతలు చర్చించినట్టు తెలిసింది. నాడు మనం అవమానించిన ఫలితం...నేడు కార్పోరేటర్లను, మేయర్ స్థానాన్ని కోల్పోయామని.. కానీ వంశీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇంత చేస్తాడని అనుకోలేదని వైఎస్సార్సీపీలోని ఒక నేత అవిశ్వాసం నెగ్గిన తరువాత వ్యక్తం చేశారట. ఆ విషయం తెలిసిన వారు కూడా ఇద్దరికే చెప్పడం మొదలు పెట్టారు(ఒకటి అడిగిన వారికి రెండు అడగని వారికి) దీనితో అందరినోటా ఆ విషయం చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు ఒక దశలో కూటమికి కార్పోరేటర్ల కూర్పు తగ్గినపుడు కూడా వంశీ వేసిన ఎత్తుగడ, ఆడిన రాజకీయపాచికలు మామూలువి కావు.
అవిశ్వాసంలో కూటమి మొత్తం శ్రమించినా.. అందులో అగ్రభాగం మాత్రం వంశీ మాత్రమే చేశారనే విషయం అవిశ్వాసం తరువాత తేటతెల్లమైంది. అనుకున్న స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయపార్టీలు ఏమైనా చేస్తాయనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కానీ అదే రాజకీయంలో మనసులో గూడుకట్టుకున్న సంఘటనలు సమయం వచ్చినపుడు అలా చేసిన పార్టీలకు, వ్యక్తులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా చేస్తాయనే విషయం ఇపుడు ఎమ్మెల్యే వంశీ విషయంలో రుజుంవైందని మాత్రం విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి నెగ్గడానికి కార్పోరేటర్ల కూర్పులో తెరవెనుక చాలా మంది టిడిపి నేతలు హస్తం వున్నా.. ఆ విషయం బయటకు రాలేదు. కావాలనే కూటమిలో ని కొందరు నేతలు బయటపెట్టలేదు. ఆ విషయంలో పలువురు టిడిపినేతలు అలకబూనారు కూడా. మనం ఎంతచేసినా పార్టీలో విలువలేకుండా పోతుందని కూడా సమావేశాలు పెట్టి చర్చలకి తెరలేపారు. ఎన్నిచేసినా.. ఏం చేసినా ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయంలో జరిగిన జివిఎంసీ మేయర్ ఎపిసోడ్.. కూటమి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో తెరపైకి మాత్రం వంశీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంతో సఫలీకృతుడు అయ్యాడనేది మాత్రమే చర్చనీయాంశం అయ్యింది..?!