సచివాలయ ఉద్యోగులకు గుండెపోటు శాపం..?! మరో ఇద్దరు ఉద్యోగులు మృతి


Ens Balu
30
visakhapatnam
2026-01-27 18:40:02

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడూ.. ఏడ ఉన్నడో గాని కంటీకి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. అన్నాడు దివంగత అందెశ్రీ.. ఈ మాటలు అక్షర సత్యం.. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికికే కాదు.. ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్సీలే కాదు.. గ్రామ వార్డు సచివాలయ శాఖ సిబ్బందికి జిల్లా అధికారులుగా ఉన్నవారు ఎవరికీ కనీసం మానవత్వం కూడా లేదు. ప్రతీ నెలా ఇద్దరు, ముగ్గురు చొప్పున సచివాలయ ఉద్యోగులు ఆకస్మికంగా గుండెపోటుతో విధినిర్వహణలోనే కుప్పకూలి మృత్యువాత పడుతున్నా..  సిబ్బందిపై వేదింపులు గానీ, పని ఒత్తిడిగాని అధికారులు ఆపడంలేదు. అంతేకాదు ఉద్యోగుల మరణాలపై విచారణ గానీ, ప్రకటనగానీ చేయడం లేదు..  దెందులూరు మండలం, గాయల గూడెం ఉద్యాన సహాయకులు నాగేంద్ర, ఎం కోడూరు మండలం, మాధవరం గ్రామంలోని  వెల్ఫేర్ అసిస్టెంట్ రామక్రిష్ణ అనే ఇద్దరు ఉద్యోలు మంగళవారం గుండెపోటుతో మృత్యువాత పడ్డారు..అయినా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పటికే కేసు నమోదు చేసిన జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా ఎలాంటి చర్యా తీసుకోలేదు..?! 

ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామపంచాయతీ(గ్రామ, వార్డు సచివాలయ)శాఖ ఉద్యోగులు గుండెపోటు మరణాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నిబంధనలకు విరుద్దంగా బిఎల్వో విధులు అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వేసి.. అప్పటికే ఉన్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేటార్గెట్లు ఇచ్చి, మాతృశాఖల పనులు కూడా అప్పగించడంతో పని ఒత్తిడి, అధికారులు వేధింపులు తట్టుకోలేని సచివాలయ సిబ్బంది పిట్టల్లా రాలిపోతున్నారు. 
కనీసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ లకి సచివాలయ ఫిర్యాదు చేసినా వాళ్లు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా నెలకి ఇద్దరు ఉద్యోగులు చొప్పున సచివాలయ శాఖలో గుండెపోటుకి బలైపోతున్నారు. 

వాటిని కప్పిపుచ్చుకోవడానికి సిబ్బందికి గుండెపోటు రోగాలు ఉన్నాయి కనుకనే మృత్యువాత పడుతున్నారని.. అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు తప్పినా.. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందునా కుటుంబానికి అన్నంపెట్టే పెద్ద దిక్కు పోయి ఆ కుటుంబం రోడ్డునా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం రావడం లేదు. రాష్ట్రంలో 75 ప్రభుత్వ శాఖలు ఉంటే ఒక్క 75వ ప్రభుత్వశాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై మాత్రమే రాష్ట్రప్రభుత్వం అన్నిప్రభుత్వశాఖల పని భారాన్ని మోపుతున్నది. దానికి తోడు ఎన్నికల సంఘంగ హ్యాండ్ బుక్ నిబంధనలను ప్రభుత్వమే తుంగలోకి తొక్కి అదే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో అదనపు విధులు అప్పగిస్తోంది. వాటికి సంబంధించి కూడా ఎలాంటి మౌళిక వసతులు కల్పించకుండా సిబ్బంది సొంత ఖర్చులతోనే అదనపు విధులు చేయాలని.. టార్గెట్లు విధిస్తూ ఉద్యోగులపై అదనపు పనిభారాన్ని మోపతున్నది. 

దానిని తట్టుకోలేకపోతున్న ఉద్యోగులు అదనపు ప్రభుత్వ  విధినిర్వహణ, సర్వేల టార్గెట్లు, అధికారుల వేధింపులు తట్టుకోలేక మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. కన్నవారికి.. కట్టుకున్నదానికి తీరని శోకాన్ని మిగిల్చి తనువులు చాలిస్తున్నారు. నేటికీ స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీల్లోని ఎంత ఉద్యోగులు మృతిచెందారనే సమాచారం ప్రభుత్వం వద్ద కూడా లేదని సమాచారం అందుతుంది. అంతేకాకుండా విధి నిర్వహణలో మృతిచెందిన వారికి, విధినిర్వహణలో అంగవైకల్యం అయిన వారికి కూడా ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం(ఎనర్జీ అసిస్టెంట్లు)కి ఇవ్వలేదని వారు కూడా జాతీయ మానవ హక్కు కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దానితో రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్యోగుల సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదేశించినా నేటికీ కమిషన్ రాష్ట్రప్రభుత్వం సమాచారాన్ని ఇవ్వలేదు. మరోప్రక్క ప్రతీనెల ఉద్యోగులు గుండెపోటుతో మృత్యువాత పడుతూనే ఉన్నారు.


-కోవిడ్ బూస్టర్ డోస్ కూడా మరణాలకు కరణమా
కోవిడ్ సమయంలో ప్రజలకు సేవలు అందించేందుకు సచివాలయ ఉద్యోగులకు బూస్టర్ డోసులు వేశారు. అలా వేసిన వారిలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని కూడా సచివాయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కోవిడ్ టీకాలు వేసుకున్నవారిలో గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నాయని వైద్య నిపుణులు కూడా చెబుతుండటంతో ఆ ప్రభావమే సచివాలయ ఉద్యోగులపై చూపడం, అదే సమయంలో అధికారుల పని ఒత్తిడి, వేధింపులు, టార్గెట్ లతో తీవ్ర మనస్థాపం, అధిక ఒత్తిడికి గురై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని కూడా చెబుతున్నారు. అప్పట్లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్న సమయంలో ప్రజలకు ఇంటిముంగిట సేవలు అందిస్తూ.. క్వారంటైన్ లలో విధులు నిర్వర్తించే ఉద్యోగులతోపాటు, అన్నిశాఖల ఉద్యోగులకు బూస్టర్ డోసులు వేశారు. అలా రెండు మూడు డోసులు వేసుకున్నవారికి శరీరంలో మార్పులు చెంది.. గుండె వేగం పెరిగడంతోపాటు, చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉద్యోగులు తీవ్ర అనారోగ్యాల భారిన పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

-విశాఖ జిల్లా కలెక్టర్ సర్క్యులర్ వట్టిదేనా..?
స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామపంచాయతీ(గ్రామ, వార్డు సచివాలయ)శాఖ ఉద్యోగులు గుండెపోటు మరణాలకు గురవుతున్న సమయంలో అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి అసలు ఏ విధంగా బిఎల్వో విధులు అప్పగిస్తున్నారో నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ జారీచేసిన సర్క్యులర్ వట్టిమాటగానే మిగిలిపోయింది. ఎన్నికల కమిషన్ హ్యాండ్ బుకల్ లో కేవలం 14 ప్రభుత్వశాఖల సిబ్బందికి మాత్రమే బిఎల్వో విధులు వేయాలని నియమ నిబంధనలు పెట్టినా.. విశాఖజిల్లా, జీవిఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు సచివాలయాల్లోని అన్నిశాఖల సిబ్బందికీ బిఎల్వో విధులు అప్పగించి సొంత ఖర్చులతోనే పనిచేయాలని టార్గెట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు చేసిన అభ్యర్ధనపై జిల్లా కలెక్టర్ జారీ చేసిన సర్క్యులర్ కి అతీగతీ లేకుండా పోయింది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో మృతిచెందిన ఉద్యోగులకు సహచర ఉద్యోగులు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

సిఫార్సు