సత్యదేవుని భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు..
Ens Balu
3
Annavaram
2021-11-11 16:13:46
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి భక్తుల సౌకర్యార్ధం మరిన్ని అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కాకినాడ ఎంపీ వంగా గీత, చైర్మన్ రోహిత్ లు పేర్కొన్నారు. గురువారం దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలిసి ఆలయ పరిసరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అంతేకాకుండా సత్యదేవుని సన్నిధిలో కార్తిక మాసంలో సందర్భంగా భక్తులు సౌకర్యాలు మరింతగా పెంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.