పాన్ షాపులపై దాడులు రూ.15వేల గుట్కా స్వాధీనం..
Ens Balu
2
Annavaram
2021-11-11 16:15:29
ఏలేశ్వరం మండలంలోని ఏలేశ్వరం అప్పన్నపాలెం గ్రామాల్లో గుట్కా అమ్ముతున్న పాన్ షాపులపై దాడుల చేసి రూ.15 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు ఏలేశ్వరం ఎస్.ఐ సి.హెచ్ విద్యాసాగర్ తెలియజేశారు. గురువారం ఆయన స్టేషనల్ మీడియాతో మాట్లాడారు. తమ సిబ్బంది సన్యాసిరావు ,శ్రీను వాసు దొర,లోవరాజు, పండుదొర గుట్కా అమ్ముతున్న షాపుల పై రైడ్ నిర్వహించి ఏలేశ్వరం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు, అప్పన్నపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.