. కోవిడ్ వేక్సినేషన్‌ను శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గుర్ల మండలం చోడవరం గ్రామ సచివాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ రిజిష్టర్‌ను, మూవ్‌మెంట్ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో పెండింగ్ ధరఖాస్తులపై ఆరా తీశారు. వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు, ఓటిఎస్ స్కీమ్‌పైనా ప్రశ్నించారు. గ్రామంలో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వేక్సిన్ వేసుకొనే విధంగా చూడాలన్నారు. ఇప్పటివరకు వేక్సిన్ వేసుకోనివారిని గుర్తించి, అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు సహకారాన్ని తీసుకొని, శతశాతం వేక్సినేషన్ జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ లావణ్య, ఎంపిడిఓ కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.