ఆ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి..


Ens Balu
1
ఎస్.రాయవరం
2020-09-14 14:25:59

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలోని... ఎస్.రాయవరం గ్రామం నుంచి గుండ్రబిల్లి వెళ్లే మార్గమధ్యలో సర్వే నెంబరు 58, ఖాతా నెంబరు 20000102లోని 76 సెంట్ల ప్రభుత్వ భూమిని తక్షణమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సమాచారహక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డికి మౌర్యకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు సర్వే చేస్తుందని, కానీ అక్రమార్కుల చెరలో వున్న భూములను మాత్రం పట్టించుకోకుండా కొంతమంది అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ భూములు వెతుకుతున్న ప్రభుత్వం పక్కా ఆధారాలతో ఆక్రమణలో ఈ భూమిని స్వాధీనం చేసుకుంటే ఈ ప్రాంతంలో మరిన్ని అన్యాక్రాంతం అయిన భూములు వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు. కేవలం రెవిన్యూ అధికారుల అండదండలతో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ భూములను ఖబ్జాచేసి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఖబ్జా చేసిన భూములను అక్రమార్కులు యధేచ్చగా సాగుచేస్తున్న విషయాన్ని స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని,అయితే సదరు అధికారులు ఆక్రమణదారులకు కొమ్ముకాయడంతో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు సోమిరెడ్డి మీడియాకి వివరిస్తూ, ఆక్రమణకు గురైన భూముల వివరాలు, సర్వే నెంబర్లు, ఫోటోలను విడుదల చేశారు.