విద్యతోనే సమాజ అభివృద్ధి..ఐటీడీఏ పీఓ


Ens Balu
1
Araku (St)
2021-11-15 15:58:13

నేటి ఆధునిక యుగంలో విద్యతోనే సమాజ అభివృద్ధి  సాధ్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ  అన్నారు. మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామంవద్ద ఏకలవ్య మోడల్ రెసిడెన్సిల్ స్కూల్ భవన నిర్మాణాలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్రమోడీ  సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఐటీడీఏ పిఓ  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో అజాదిక అమృత మహోత్సవం, గిరిజన భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా అరకులోయ మండలంలోని మజ్జివలస,పెదబయలు మండలం లకేపుట్టు, జి.మాడుగుల మండలం పి.జి.మాడుగులలో  రూ.5.976కోట్లు  వ్యయంతో మూడు పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్లు
 ఆయన తెలిపారు. ఉన్నత విద్యాభయసంతో నవసమాజ నిర్మాణం చేపట్టడమే కాకుండా సమస్యలు సునాయాసంగా పరిస్కరించు కోవచని ఆయన పేర్కొ నారు.నిరక్షరాస్యత నిర్మూలించి శత శాతం అక్షరాస్యత పెంపొందించడంలో భాగంగా  నవోదయ తరహాలో 5 వేలమంది గిరిజన బాల బాలికలకు విద్యను అందించడానికి అంకురార్పణ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన 14 నెలల గడువులోగా నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. నాణ్యతతో నిర్మాణాలు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో కి  తీసుకుని రావాలన్నారు. ఏకలవ్య పాఠశాలలో 480 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. గిరిజనుల విద్యాభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని అనంతగిరి, పాడేరుకు చెందిన గిరిజనులు స్వచ్ఛందంగా వచ్చి భూదానం చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ లో స్కిల్ డెవలప్మెంట్ సెల్ , టూరిజం సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. 15రోజులకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు.
గురుకులం సెక్రెటరీ డా.కె.శ్రీకాంత్ ప్రభాకర్ మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయడం గిరిజనులకు వరమని అన్నారు. ఆంద్రప్రదేశ్ లోనే ఏకలవ్య పాఠశాలలకు మొట్టమొదటి సరిగా భూసేకరణ జరిగిందన్నారు. ఏకలవ్య లో 52 మంది ఉపాధ్యాయులు వుండి,అత్యున్నత విద్యను అందిస్తారాని అన్నారు. ఐ ఐ టిలో 90 మంది సీట్లు సాధిస్తే పాడేరు నుంచి 27 మంది సీట్లు సాధించారని అన్నారు.ఈ ఏడాది ప్రభుత్వం 9 ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయగా వాటిలో 9 పాడేరు డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో గురుకులం పాఠశాల, కళాశాల ,ఏకలవ్య పాఠశాలలు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో  ఈ పి ఐ ఎల్  డైరెక్టర్ రాధాకృష్ణ, గ్రూప్ జనరల్ మేనేజర్ అరుంధతి భౌమిక , టీడబ్ల్యూ ఎస్.ఈ. ఎస్.శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ వెంకట రాంబాబు, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, సర్పంచ్ దురుయా భాస్కర రావు,గురుకులం కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు