వాణిజ్య పంటలు, కూరగాయల పంటలకు వర్షాలు తగ్గుముఖం పట్టగానే చీడపీడలు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఉద్యావనశాఖ అధికారిణి సైలజ పేర్కొన్నారు. బుధవారం ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాణిజ్య పంటలకు పదిశాతంలో లోపు మాత్రమే నష్టం వాటిల్లిందన్నారు. రైతులు వాణిజ్య పంటల పెంపకంలో చీడలు ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టం పెరగకుండా చేసుకోవడానికి వీలుపడుతుందన్నారు. అంతేకాకుండా చీడలను ఆదిలోనే నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరువాత 19-19-19, 30-0-45 లేదా యూరియా ఏదో ఒకటి పంటలపై పిచికారి చేసుకోవాలన్నారు. రైతులు వాణిజ్య పంటల సస్యరక్షణ చర్యలు, సూచనలు, సలహాల కోసం గ్రామసచివాలయాల పరిధిలోని గ్రామీణ ఉద్యానవన సహాయకులను సంప్రదించాలన్నారు. లేదంటే పంట పొలాల్లో నిర్వహించే తోడ బడి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టే విధానాలను తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఈ సందర్బంగా సూచించారు.