ఓటిఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి..
Ens Balu
5
Bondapalli
2021-11-17 10:58:22
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, సచివాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు ఆదేశించారు. బొండపల్లి మండలం నెలివాడ, రాచకిండాం గ్రామ సచివాలయాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తీనిఖీ చేశారు. ఆయా సచివాలయాల్లోని అటెండెన్సు రిజిష్టర్‌ను, రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయాలకు వచ్చిన వినతులు, పథకాల అమలును పరిశీలించారు. కోవిడ్ వేక్సినేషన్‌పై ఆరోగ్యమిత్రను ప్రశ్నించారు. శతశాతం వేక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలనుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ఓటిఎస్ పథకం సువర్ణావకాశమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అతితక్కువ మొత్తాన్ని చెల్లించి, ఇంటిపై సంపూర్ణ హక్కును శాశ్వతంగా పొందవచ్చని సూచించారు. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి, అందరూ దీనిని సద్వినియోగం చేసుకొనే విధంగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జెసి కోరారు.