రక్తదాతలంతా ప్రాణదాతలే.. ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు
Ens Balu
2
కాకినాడ రూరల్
2021-11-20 11:19:38
రక్తదాతలంతా ప్రాణదాతలేనని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలంలోని పెనుమర్తి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దానశిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం ద్వారా దానితో ఎనిమిది మందికి ఆరోగ్యాన్ని ప్రశాదించవచ్చునన్నారు. ఆపద సమయాల్లో ఈ రక్తం క్షతగాత్రులకు ప్రాణం నిలబెతుందని అన్నారు. ముఖ్యంగా యువత రక్తదాన శిబిరాల్లో పాల్గొని మంచి సేవకులుగా ఎదగాలని సూచించారు. చాలా మందికి రక్తం ఇవ్వడం ద్వారా అనారోగ్యం భారిన పడతామని అపోహ వుంటుందని..కాని రక్తం ఇవ్వడం ద్వారా మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని ఆరోగ్యవంతులు ఏడాదిలో రెండు నుంచి మూడు సార్లు రక్తం దానం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆసుపత్రి వ్యవస్థాపకులు చంద్రశేఖర్, రోటరీ క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.