కరోనా నుంచి ప్రజలను కాపాడు స్వామి...గంట్ల


Ens Balu
4
Kotta Road
2020-06-27 13:33:45

జగన్నాధస్వామి ఉత్సవాల్లో భాగంగా బలభద్ర, సుభద్ర సమేత శ్రీజగన్నాథ స్వామి శనివారం నరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఈఏడాది రథోత్సవాన్ని నిర్వహించకుండా ఆలయంలోనే స్వామి దర్శనం కల్పిస్తున్నారు.. సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులకు జగన్నాథుడు స్వామి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శిరీష తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు, పలువురు భక్తులు స్వామిని దర్శించుకున్నారు.