ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించండి..


Ens Balu
3
Karapa
2021-11-20 13:02:29

కరప మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేసి అవగాహన కల్పించాలని తహశీల్దార్ శ్రీనివాసరావు విఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. శనివారం కరప తహశీల్దార్ కార్యాయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు పీఎసిఎస్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి గాయత్రీదేవితో కలసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆర్బేకే కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న విషయం ప్రతీ రైతుకు తెలియాలన్నారు. మండలంలోని గ్రామసచివాలయాల పరిధిలోని వీఆర్వోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు జరగాలన్నారు. ఈ విషయంలో రైతులకు  ఏ రకమైన అనుమానాలు వున్న ప్రభుత్వం నిర్ధేశించిన నియమ నిబంధనలను వారికి తెలియజేసి అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్ సూచించారు.
సిఫార్సు