పాఠశాలల్లో నేషనల్ అసెస్ మెంట్ సర్వే..
Ens Balu
5
Karapa
2021-11-20 13:03:49
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసు కొనేందుకు నేషనల్ అసెస్మెంట్ సర్వే కాకినాడ రూరల్ మండలంలో చక్కగా జరుగుతోందని మండల విద్యాశాఖ అధికారి ఐ.గణేష్ బాబు అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక ఉన్నత పాఠశాలల్లో ఒక్కో తరగతికి 30 మంది చొప్పున విద్యార్థులే ఉన్నారా, అంతకు మించి ఉన్నారా, వారి విద్యా ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయనే విషయంపై సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్ధులు కాస్త వెనుకబడినా మళ్లీ పాఠశాలల్లో విద్య సాధారణ స్థాయికి రావడంతో మళ్లీ పుంజుకుంటున్నారని ఎంఈఓ తెలియజేశారు. ఈ సమయంలోనే అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యార్ధులకు మరింత మెరుగైన విద్య అందించే విధంగా సూచనలు సలహాలు అందిస్తున్నట్టు మండల విద్యాశాఖ అధికారి ఐ.గణేష్ బాబు వివరించారు.