ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు..
Ens Balu
4
Karapa
2021-11-21 11:22:26
కరప మండలంలో ధాన్యం కొనుగోలు రైతు భరోసా కేంద్రాల వద్దే చేపడుతన్న విషయాన్ని రైతులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నట్టు మండల వ్యవసాయశాఖ అధికారిణి ఎ.గాయత్రీదేవి తెలియజేశారు. ఈ మేరకు కరప మండలంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామీణ వ్యవసాయ సహాకులు మరియు సచివాలయ గ్రామవాలంటీర్ల సహాయంతో రైతులకు ధాన్యం కొనుగోలుపై చైతన్యం తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆర్బేకే కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న విషయం ప్రతీ రైతుకు తెలియాలనే ఉద్దేశ్యంతో సచివాలయాల పరిధిలో ప్రత్యేక అవగాహన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మకానికి తీసుకు వచ్చే లోపు ఈ-క్రాప్ బుకింగ్, బ్యాంకు అకౌంట్ ఈ-కేవైసీ పూర్తిచేసుకొని ఉండాలన్నారు. ఒక వేళ ఎవరైనా రైతులు చేయించుకోకపోతే గ్రామీణ వ్యవసాయ సహాయకులను ఆర్బీకేల్లో సంప్రదించి చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన వ్యవసాయ అధికారిణి గాయత్రీ దేవి ఈ సందర్భగా మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.