14884 ఎకరాల్లో ఈ-క్రాప్ బుకింగ్ పూర్తి..


Ens Balu
4
Karapa
2021-11-21 11:23:51

కాకినాడ రూరల్ నియోజకవర్గంల పరిధిలోని కరప మండలంలో 14వేల 884 ఎకరాల్లో ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసినట్టు మండల వ్యవసాయ అధికారిణి ఎ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కరపలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.విజయ్ కుమార్ ఆదేశాలతో అనుకున్న సమయానికే ఈ-క్రాప్ బుకింగ్ తోపాటు, రైతుల బ్యాంక్ అకౌంట్ ఈ-కెవైసీ కూడా పూర్తిచేశామన్నారు. ఇపుడు పంట నష్టపోయిన రైతులకు ఈ-క్రాప్ నమోదు ఆదారంగానే  ఇన్ పుట్ సబ్సిడీ, నష్టపరిహారాలు అందనున్నాయని చెప్పారు. మండలంలో 21 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 19 మంది గ్రామీణ వ్యసాయ సహాయకుల ద్వారా అనుకున్న సమయానికే ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసినట్టు ఆమె ఆ ప్రకటనలో మీడియాకి తెలియజేశారు.

సిఫార్సు