నష్టపోయిన ప్రతీరైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..


Ens Balu
4
Karapa
2021-11-22 13:45:07

తుపానులో పంట నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యన్నారాయణ పేర్కొన్నారు. సోమవారం కరప మండలంలోని ఇటీవ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన స్థానిక వ్యవసాయ అధికారిణి ఏ.గాయత్రీదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించిందని అన్నారు. ఒక్క కరప మండలంలోనే 12వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి ఆయనకు వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తరవాత పూర్తివివరాలు ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు, మండల నాయకులు పాల్గొన్నారు.

సిఫార్సు