ఉప్పలంక లో ఓటిఎస్ కింది ముగ్గురుకి రిజిస్ట్రేషన్లు..


Ens Balu
7
Karapa
2021-11-23 14:54:00

కరప మండలంలో ఉప్పలంక గ్రామసచివాలయంలో ముగ్గు రు లబ్దిదారుల నుంచి రూ.30వేలు ఓటిఎస్ కింద వసూలు చేసినట్టు ఈఓపీఆర్డీ నాగేంద్ర తెలియజేశారు. ఈ మేరకు కరపలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప్పలంక పంచాయతీలో మల్లాది నాగూర్, సాదరబోయిన నాగలక్ష్మి, సంగడి కనకరాజు అనే ముగ్గురు నుంచి వన్ టైమ్ సెటిల్ మెంట్ కిందర రూ.30వేలు వసూలు చేసి వారికి ఇంటి స్థలం రిజిస్ట్రేషన్లు చేసిఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన లబ్దిదారులు కూడా వేగంగా ఓటిఎస్ కింద వచ్చిన పేర్లు కింద రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని  సూచించారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన ఈ కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు స్థలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియతో సొంతం అవుతుందని వివరించారు. ఈ అవకాశన్ని జాబితాలో పేర్లు వచ్చినవారంత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈఓపీఆర్డీ కోరారు.
సిఫార్సు