జగనన్న స్వచ్చసంకల్పం కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.. ఎంపీడీఓ కె.స్వప్న


Ens Balu
2
Karapa
2021-11-23 14:56:14

కరప మండలంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలోని ప్రజలకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అవగాహన కల్పించాలని ఎంపీడీఓ కె.స్వప్న సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని అన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలతోనూ ఆమె టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతీ ఇంటి వద్ద తడి చెత్త, పొడిచెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి ఇచ్చేవిధంగా చూడాలన్నారు. తద్వారా చెత్త సేకరణ సులవవుతుందని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అంతేకాకుండా గ్రామ వాలంటీర్లకు వారికి కేటాయించిన కుటుంబాలకు వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలన్నారు.  ఇప్పటికే అన్ని పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు మంజూరు చేసిందని వాటిని కూడా జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రామానికి పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆమె సూచించారు.
సిఫార్సు