వన్ టైమ్ సెటిల్ మెంట్ లక్ష్యాలను పూర్తి చేయాలి..
Ens Balu
3
కాకినాడ రూరల్
2021-11-23 15:47:46
కాకినాడ రూరల్ మండలం పరిధిలో వన్ టైమ్ సెటిల్ మెంట్ లక్ష్యాలను పూర్తిచేయాలని ఎంపీడీఓ పిఎన్.మూర్తి సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రం నుంచి అన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలో ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాల ఆధారంగా ఒటిఎస్ ను పూర్తిచేయాలన్నారు. ముందు లబ్దిదారులకు ఓటిఎస్ యొక్క ఉపయోగాలు తెలియజేయడం ద్వారా ఎక్కువ మంది ముందుకి వచ్చే అవకాశం వుంటుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామవాలంటీర్లకు వారికి కేటాయించిన ఇళ్లలో ఎంత మంది ఓటిఎస్ జాబితాలో ఉన్నారో తెలుసుకొని వారి ద్వారా సంప్రదింపులు చేయించాలన్నారు. ఓటిఎస్ లో జిల్లాలోనే కాకినాడ రూరల్ మండలం ముందుండేలా సచివాలయ సిబ్బంది శ్రమించాలని ఎంపీడీఓ సూచించారు. థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామసచివాలయం ముందు ప్రతీరోజూ శానిటేషన్ చేయించి బ్లీచింగ్ చల్లించాలన్నారు ఆదేశించారు.