జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీతో అవగాహన..
Ens Balu
2
Karapa
2021-11-25 17:07:34
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కరప ఎంపీడీఓ కె.స్వప్న పేర్కొన్నారు. గురువారం కరప మండల కేంద్రంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, కాలువల్లో చెత్తలు వేడయం ద్వారా మురుగునీరు ప్రవాహం నిలిచిపోయి దోమలు వ్రుద్ధి చెందడంతో పాటు, దుర్వాస వెదజల్లుతుందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి వీధుల్లోకి చెత్త సేకరణకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. లేదంటే గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చెత్త డంపర్ బిన్ లలో వేయాలన్నారు. అంతేకాకుండా చెత్త వేసే సమయంలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదన్నారు. అవి మట్టిలో కలిసే అవకాశం లేనందున కాలుష్య కారకాలుగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నాగేంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.