ముందు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..


Ens Balu
3
Kakinada
2021-11-25 17:08:38

రోగాలు వచ్చిన తర్వాత చికిత్స పొందే కన్నా అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక జీవనశైలి, శారీరక వ్యాయామం లోపించడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడంతో పలువురు  స్థూలకాయులు అయ్యి దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం ,రక్తపోటు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులకు గురవుతున్నారన్నారు. దీని నివారణకు గాను రోజూ క్రమబద్ధంగా వ్యాయామం చేయాలని, ఆహారంలో నూనె పదార్ధాలు తగ్గించాలని, తీపి పదార్థాలు తిన రాదన్నారు. పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవాలని డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు