ఓటిఎస్ పై సిబ్బంది ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలి..


Ens Balu
3
Karapa
2021-11-25 17:10:10

గ్రామ సచివాలయ సిబ్బంది ఒటిఎస్ వసూళ్లపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని కరప మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్ శ్రీనివాసరావు గ్రామసచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కరప మండల కేంద్రంలోని సచివాలయ పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ పై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున..సచివాలయాల వారీగా సిబ్బంది నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. పంచాయతీలకు వచ్చిన ఓటిఎస్ జాబితాల వారీగా లబ్దిదారుల ఎంపిక చేసి, వారికి అవగాహన కల్పించడంతోపాటు, వారినుంచి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాలను వసూలు చేయడంతోపాటు వారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల గ్రేడ్1 నుంచి డ్రేడ్ 5 వరకూ కార్యదర్శిలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు