మహిళలపై హింస కూడా హక్కుల ఉల్లంఘనే..


Ens Balu
2
Kakinada
2021-11-25 17:11:39

గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగి మహిళలకు రక్షణ కొరవడిందని ఇవన్నీ  మానవ హక్కుల ఉల్లంఘనే  అని ప్రముఖ న్యాయవాది శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట, రాయుడు పాలెం లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ  స్త్రీ హింస నిరోధక దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళ  అన్నిరంగాల్లో ఎదుగుతున్నా ఆమెపై హింస అణచివేత వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు.  వయసు తారతమ్యం లేకుండా అన్ని ఆదాయ వర్గాలు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలంతా బాధితులేనని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి పలు చట్టాలు ఉన్నాయి అన్నారు. సమాజం కోసమో, సంప్రదాయాల గురించో లేదా పిల్లల కోసమో   హింసను భరించాల్సిన అవసరం లేదని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే అండగా నిలుస్తుందని శ్రీలక్ష్మి తెలిపారు. అనంతరం ఉచిత న్యాయ సేవలు పై కరపత్రాలు పంచుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు