రాజ్యాంగం వలనే అన్నివర్గాలకు సమాన హక్కులు..


Ens Balu
3
Karapa
2021-11-26 10:46:16

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అన్ని వర్గాలకు సమాన హక్కులు సమకూరాయని కరప ఎంపీడీఓ కె.స్వప్నపేర్కొన్నారు.  రాజ్యాంగ నిర్మాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరప మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ  మాట్లాడుతూ నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి విశేష గౌరవం వుందని, దానిని మనమంతా మరింత గౌరవించుకోవాలని ఎంపీడీఓ స్వప్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు