ముందస్తు జాగ్రత్తలతోనే తెల్లదోమను నియంత్రణ..


Ens Balu
3
Pithapuram
2021-11-26 15:42:43

రైతులు పామాయిల్ తోటల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తెల్లదోమను నియంత్రించడానికి వీలుపడుతుందని ఉద్యవన శాఖ అధికారిణి సైలజ పేర్కొన్నారు. శుక్రవారం పిఠాపురం మండల దొంతమూరు గ్రామంలోని పామాయిల్ తోటల్లో తోటబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పామాయిల్ తోటల్లో తెల్లదోమను ఆదిలోనే నియంత్రించకపోతే అది తోట మొత్తం పాకే అవకాశం వుంటుందన్నారు. ముఖ్యంగా పాయిల్ చెట్లకు పసుపురంగు అట్టలను చుట్టి పెట్టుకోవాలన్నారు. ఐసేరియా ఫ్యూమోసోరోస్ ఫంగస్ ద్రవాణాన్ని ఉద్యాన రైతుల సౌకర్యార్ధం రైతు భరోసా కేంద్రాలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఐదు మిల్లీ లీటర్లకు లీటరు నీరుని కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. రైతులు ఏవిధంగా దీనిని తయారు చేసుకోవాలో ఆర్బీకేల్లోని ఉద్యాన సహాయకుల ద్వారా అడిగి తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉద్యాన సహాయకులు, వ్యవసాయ సహాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
సిఫార్సు