ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ చాలా కీలకం..


Ens Balu
4
Kakinada
2021-11-26 15:46:38

ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ  సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిని దాటి నప్పుడు న్యాయవ్యవస్థ  నియంత్రిస్తుందని అన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని,  సత్వర న్యాయం కోసం కృషి చేయడం న్యాయ దినోత్సవ లక్ష్యం అన్నారు. 1976 లో  రాజ్యాంగంలో39ఎ జతచేసి  ఉచిత న్యాయ సహాయం న్యాయసేవాధికార సంస్థ ద్వారా లభిస్తుందన్నారు. పత్రికా కథనాలను కూడా సుమోటోగా స్వీకరిస్తూ న్యాయస్థానాలు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయన్నారు. మూకుమ్మడిగా ప్రజాప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు, సంస్థలు వారి తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యాల లో  పోరాడుతున్నాయి అన్నారు. న్యాయం గురించి ప్రతి పౌరుడు తెలుసుకుంటే జాతీయ న్యాయ దినోత్సవానికి సార్థకత చేకూరుతుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్ ,ఎం.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు