వేక్సినేషన్ కు స్వచ్ఛందంగా ముందుకి రావాలి..


Ens Balu
2
Sankhavaram
2021-11-30 15:45:55

థర్డ్ వేవ్ కోవిడ్ హెచ్చరికలను ద్రుష్టిలో ఉంచుకొని వేక్సినేషన్ చేయించుకోని వారు స్వచ్ఛందంగా ముందుకి రావాలని శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ కోరారు. మంగళవారం శంఖవరం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ వేక్సినేషన్ చేయించుకొని ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చునన్నారు. కోవిడ్ కేసులు తగ్గాయని అజాగ్రత్త ఊండకూడదని హెచ్చరించారు. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రస్తుతం శంఖవరం పీహెచ్సీలో పరిధిలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలో డోర్ టు డోర్ కోవిడ్ సర్వే జరుగుతోందన్నారు. ఇంటికి వచ్చే తమ ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వడం ద్వారా కోవిడ్ టీకా వేయించుకోని వారికి వెంటనే వేక్సిన్ అందించడానికి ఆస్కారం వుంటుందన్నారు.
సిఫార్సు