శంఖవరం పీహెచ్సీలో 28 మందికి కంటి పరీక్షలు..
Ens Balu
2
Sankhavaram
2021-11-30 16:23:36
వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ఏర్పాటు చేసిన వైద్యశిబిరం ద్వారా 28 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన శంఖవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పీహెచ్సీలో ప్రతీ మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రత్యేకంగా కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి కాకినాడలో ప్రత్యేకంగా వాటిని ఉచితంగానే చేపడతారని వివరించారు. కాగా శంఖవరం పీహెచ్సీ పరిధిలోని సుమారు 52 వేలమంది ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.