పశువులను సకాలంలో యదకు వచ్చేలా చూడాలి..ఏడీ డా.సురేష్ బాబు


Ens Balu
2
Karapa
2021-11-30 16:35:09

పాడి రైతులు పశువులను సకాలంలో యదకు వచ్చేలా చూసుకోవాలని కరప పశువుల ఏరియా ఆసుపత్రి ఏడీ డా.సురేష్ బాబు సూచించారు. వాతావరణ మార్పులు, చూడి నిలబడకపోవంటి సమస్యలు ఎదురైతే తక్షణమే పశువుల ఆసుపత్రికి తీసుకు వస్తే క్రుత్రిమ గర్భోత్పత్తి చేపడతామని చెప్పారు. రైతుకి పాడి ఆవులు, గేదెలు తరచు దూడలు కనడం ద్వారా ఆర్ధికంగా లాబసాటిగా వుంటుందన్నారు. లేదంటే పాడి పశువులు ఉన్నా నష్టాలే చవిచూడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ పశు వైద్యాలయం సేవలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సేవల కోసం గ్రామసచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో గ్రామీణ పశుసంవర్ధక సహాయకులను సంప్రదించవచ్చునని ఆయన ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.
సిఫార్సు