అన్నవరంలో స్మశాన వాటిక స్థలం మంజూరుకు జిల్లా కలెక్టర్ అంగీకారం..


Ens Balu
4
Annavaram
2021-11-30 16:38:02

అన్నవరం గ్రామపంచాయతీలో స్మశాన వాటిక ఏర్పాటుకి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అంగీకారం తెలియజేశారని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా తెలియజేశారు. మంగళవారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. అన్నవరం సత్యదేవుని దర్శించుకునేందుకు రత్నగిరి క్షేత్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ద్రుష్టికి గ్రామంలో స్మశాన వాటిక లేక ప్రజలు పడుతున్న ఇబ్బదులను తెలియజేసినట్టు పేర్కొన్నారు. దీనితో కలెక్టర్ స్మశాన వాటికకు స్థలం కేటాయించేందుకు అంగీకరించారని సర్పంచ్ తెలియజేశారు. కలెక్టర్ పిలుపుమేరకు ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టరేట్ అందిస్తామని సర్పంచ్ కుమార్ రాజా ఈ సందర్భంగా మీడియాకి వివరించారు. స్మశాన వాటికకు స్థలం మంజూరైతే అన్నవరం గ్రామప్రజలు ఇబ్బందులు తొలిగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సిఫార్సు