శ్రీ సత్యదేవ నిత్య అన్నధాన ట్రస్టుకి ఒక లక్షా 116 విరాళం..
Ens Balu
2
Annavaram
2021-11-30 16:39:14
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రుముఖ పుణ్య క్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నధాన ట్రస్టుకి గుంటూరు జిల్లా మాచెర్లకు చెందిన బండారు సత్యన్నారాయణ దంపతులు ఒక లక్ష 116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానంలోని ఏఈఓకి చెక్కురూపంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, జనవరి 3వ తేదిన చరణ సత్యసాయి పేరుతో అన్నదానం చేయాలని దేవస్థాన అధికారులను కోరారు. అనంతరం దాతలు స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.