హెచ్ఐవీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి..
Ens Balu
3
Sankhavaram
2021-12-01 16:35:03
హెచ్ఐవీ, ఎయిడ్స్ పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శంఖవరం మండల కేంద్రంలో పారామెడికల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. మందులేని హెచ్ఐవీ వచ్చినా ఏఆర్టీ మందులు తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని 20ఏళ్లు వరకూ జీవించవచ్చునన్నారు. అదే సమయంలో ఎయిడ్స్, హెచ్ఐవీ కోసం అవగాహన పెంచుకోవడం ద్వారా వాటి బారిన పడకుండా ఉండేందుకు అవకాశం వుంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్, మూడు గ్రామసచివాలయాల ఆరోగ్య సహాయకులు, వెంకటలక్ష్మి, దేవమణి, లక్ష్మి, సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.