మహిళా పోలీసుల సేవలు ప్రజలకు తెలియజేయాలి..
Ens Balu
4
Prathipadu
2021-12-01 16:36:34
గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుల సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతాయో ప్రజలకు తెలిసే అవగాహన కల్పించాలని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు మహిళా పోలీసులకు సూచించారు. బుధవారం ప్రత్తిపాడులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐను శంఖవరం మండల గ్రామసచివాలయ మహిళా పోలీసులు భోజన విరామసమయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామసచివాలయాల్లోని మహిళా పోలీసులు గ్రామ రక్షకులిగా పనిచేయాలన్నారు. జిల్లా కార్యాలయం నుంచి వచ్చే ప్రతీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. సిఐని కలిసిన వారిలో కళాంజలి, నాగసత్యశిరీష, రజియాసుల్తానా, రమ్యశ్రీ, ఉమాంజలి దేవి తదితరులు పాల్గొన్నారు.