ప్రజలకు పీహెచ్సీ ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందాలి..


Ens Balu
3
Karapa
2021-12-02 14:54:51

థర్డ్ వేవ్ కరోనా, ఇతర సీజనల్ జ్వరాలు వ్యాధులను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అందించాలని  రాష్ట్ర వ్యవసాయ,శాఖ మంత్రి కురసాల కన్నబాబు పీహెచ్సీ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కరప మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన మండల అధికారులతో కలిసి సందర్శించి  వైద్యసేవలును పరశీలించారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.శ్రీనివాసనాయక్ ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలు చేయడంతోపాటు, ఇతర రోగాలకు కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించి ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ ద్రుష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎంపీడీఓ కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు