సర్పవరం సిఐగా ఆకుల మురళీ క్రుష్ణ..


Ens Balu
3
Sarpavaram
2021-12-02 15:46:46

ప్రజా పోలీస్ గా సేవలందించడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని సర్పవరం సిఐ ఆకుల మురళీ క్రిష్ణ పేర్కొన్నారు. గురువారం సర్పవరం సర్కిల్ స్టేషన్ లో ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు, జర్నలిస్టులు కలసి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఏ విషయంలోనైనా ప్రజల సేవలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదే సమయంలో కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలని సిఐ ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రజలను కోరారు.
సిఫార్సు