విభిన్నప్రతిభావంతులను మంచి మనసుతో ఆదరించాలి..
Ens Balu
4
Karapa
2021-12-03 15:59:11
స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ సహితంగా బతుకుతూ, అస్తిత్వాన్ని కాపాడుకునే విభిన్న ప్రతిభావంతులను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని కరప మండలాభివ్రుద్ధి అధికారిణి కె.స్వప్న పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని భవిత కార్యాలయంలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ, పుట్టకతోనే వైకల్యం వచ్చిన వారిని వికలాంగులు అనే పదం వాడి పిలవకూడదన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా విభిన్న ప్రతిభావంతులు అనే పదంతో పిలవాలన్నీరు. వారికి ప్రతిభ ఉన్నరంగాల్లో వారిని ప్రోత్సహించడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు చేయూత అందించేందుకు మానవతా ద్రుక్పదంతో ముందుకి రావాలన్నారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఏ.శ్రీనివాసరావు, ఫౌండేషన్ ప్రతినిధి అలీం, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.