కరప మండలంలో ప్రయోగాత్మకంగా వరి పంటల కోతలు..


Ens Balu
2
Karapa
2021-12-03 16:01:50

కరప మండలంలో ప్రయోగాత్మకంగా వరిపంటల కోతలు మొదలు పెట్టినట్టు మండల వ్యవసాయాధికారిణి ఏ.గాయత్రీదేవి తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని పెడగుదురు, పాత్రలగెడ్డ ఏరియాలో కోతలు ప్రారంభించినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారిణి మాట్లాడుతూ, గత నెలలో వర్షాలకు బాగా నానిపోయిన పంటల జాగ్రత్త కోసి నీడలో ఆరబెట్టడం ద్వారా గింజలోని తేమ తగ్గిపోకుండా వుంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మాత్రమే కోతలు కార్యక్రమం చేపట్టామని, వాతావరణం పూర్తిగా అనుకూలించిన తరువాత పూర్తిస్థాయిలో కోతలు, నూర్పులు చేపట్టే విధంగా రైతులకు సూచించినట్టు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంతో రెండు గ్రామాల గ్రామీణ వ్యవసాయ సహాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు