ఫలితం ఆశించకుండా చేసేదే అసలైన సేవ..
Ens Balu
2
Kakinada RTC Bus Complex and Depot
2021-12-05 12:12:37
నిశ్వార్ధంగా ఫలితం ఆశించకుండా చేసేదే అసలైన స్వచ్ఛంద సేవ అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు ముందుకు వస్తున్న వారందరినీ గుర్తించేందుకు గాను ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటున్న మన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ ఈ సృష్టి సమస్తం సేవల మయం అన్నారు. మనిషి సుఖంగా జీవించేందుకు ప్రకృతిలోని ప్రతిదీ నిస్వార్ధంగా సేవలు అందిస్తుందని అన్నారు. ప్రతిఫలం ఆశించి చేసేది సేవ కానే కాని సూచించారు. కులమతాలకు అతీతంగా చేసేది సేవ అన్నారు. ప్రేమతో చేసిన సేవ అన్నిటికంటే గొప్పది అని యనమల తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మిని, మీకోసం స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లి నాగేశ్వరరావుల ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాఘవరావు, బాపిరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.