పాపం చేసిన ఫలితం ప్రతీ ఒక్కరినీ వెంబడిస్తుందని..


Ens Balu
4
Kakinada
2021-12-05 12:16:53

ఏదో ఆశించి పాపపు పనులు చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా వెంబడిస్తుందనే విజ్ఞత ఉంటే దాని జోలికి  వెళ్ళమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ధర్మ విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం ,పాపపుణ్యాలు పరిగణించక పోవడం, అమాయకులను బాధ పెట్టడం, సజ్జనులు, పెద్దలను నిందించడం, హింస, హత్యలు, దొంగతనం చేయడం వలన కష్టాలు తప్పవన్నారు. మంచి ఆలోచన, సద్బుద్ధి, పేదల పట్ల ప్రేమానురాగాలు ఉన్నవారికి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అన్నారు. ఈ కర్మ ఫలం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని అన్నారు. పాపపుణ్యాల కర్మ ఫలం ఈ జన్మలోనే అనుభవిస్తారని ఇంకా మిగిలి ఉంటే మరో జన్మలో కి బదిలీ అవుతాయని అన్నారు. అందుచేత ప్రతి వ్యక్తి సచ్చిలతతో, పరోపకారంతో మెలిగితే సుఖసంతోషాలతో జీవించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు