భగవంతునికి అత్యంత ఇష్టమైనది పరోపకారమే..
Ens Balu
2
Kakinada
2021-12-06 17:02:39
పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రమణయ్యపేట ఎన్టీఆర్ నగర్లో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం. వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడని అన్నారు. ఆ దిశగా ప్రతి ఏటా శీతాకాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న వరలక్ష్మి సేవాతత్పరత అభినందనీయమన్నారు. ఎదుటివారికి సేవచేసేవారిని ఆదేవదేవుడు ఎప్పుడూ ఇష్టమైన భక్తులకుగా స్వీకరిస్తాడనే విషయాన్ని దాతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, అడబాల రత్న ప్రసాద్, ఆర్.రాజా తదితరులు పాల్గొన్నారు.